హైదరాబాద్ః పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల మీద తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చర్చ కోరితే...కేవలం 1:30 నిమిషాల పాటు మైక్ ఇచ్చి కట్ చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. చర్చకు రాకుండా ప్రభుత్వం వెనుతిరగడం దారుణమన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకేర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తుందని కోటంరెడ్డి చెప్పారు. <br/>ఈ దేశంలో తానొక్కడినే మేధావినని విర్రవీగే యనమల అంహకారం కారణంగానే ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. తెలిసీ తెలియకుండా అజ్ఞానంతో అన్నీ తెలుసునని ఫోజులు కొడుతూ...శాసనసభా సమయాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభ తలదించుకునే పరిస్థితికి యనమల తీసుకొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షం గొంతు నొక్కే చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. <br/>