జ‌ల‌వ‌న‌రుల శాఖ కాదు... ధ‌నవ‌న‌రుల శాఖ‌

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి
ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు చేయ‌కుండా కేవ‌లం ముడుపుల కోస‌మే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్రాజెక్టుల‌ను క‌డుతోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కె. పార్థ‌సార‌ధి ధ్వ‌జ‌మెత్తారు. 2018లోగా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని చెబుతూనే,  ప‌ట్టిసీమ పేరుతో కోట్ల దోపిడీకి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు తీసుకురావ‌డానికి అన్ని అవ‌కాశాలున్నా ప‌ట్టిసీమ పేరుతో  ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌ని మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో పార్థ సార‌ధి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..
 
చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల బాగోగుల‌కంటే ముడుపులే ముఖ్యం
ప్ర‌తిప‌క్షాల మాట పెడ‌చెవిన‌పెట్టి ప‌ట్టిసీమ‌ను పూర్తి చేశామ‌ని చెబుతున్నారు
కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను ముహుర్తాలు పెట్టి మూడ‌వ సారి అనుసంధానం చేస్తున్నారు
న‌దులు ఎన్నిసార్లు క‌లుస్తాయి.. రెండుసార్లు చేసిన అనుసంధానాలు ఏంటి..?
కృష్ణాడెల్టాకు జ‌రిగే లాభానికి, ప్ర‌భుత్వం పెడుతున్న ఖ‌ర్చుకు పొంత‌న లేదు
పోల‌వ‌రం ప్రాజెక్టును శాశ్వ‌తంగా స‌మాధి చేయ‌డానికే బాబు ప్ర‌య‌త్నం
పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన ఎడ‌మ కాలువ‌పై మ‌రో లిప్ట్ ఇరిగేష‌న్ ప్రారంభించ‌డానికి బాబు ప్ర‌య‌త్నాలు
25 టీఎంసీల నీటిని 12 మోట‌ర్ల‌తో ఉత్త‌రాంధ్ర‌కు చేర్చ‌డానికి ప్ర‌య‌త్నాలు
కృష్ణా, గోదావ‌రి డెల్టాల‌కు, ఉత్త‌రాంధ్ర‌కు పోల‌వ‌రం సంజీవ‌ని
ఈ స్కీం ద్వారా మ‌రో వెయ్యి కోట్ల‌లో రూ. 400 కోట్ల‌ను దోచుకునేందుకే బాబు ల‌క్ష్యం
కేంద్ర ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల్సిన పోల‌వ‌రాన్ని అప్ప‌గించ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే క‌డుతుంద‌ని చెప్ప‌డానికి ఇదే కార‌ణం
ఒక ప‌క్క ప‌ట్టిసీమ‌, మ‌రోప‌క్క ఎడ‌మ కాల్వ‌పై ఈ ప్రాజెక్టు క‌డితే ఇక పోల‌వ‌రం ఎందుక‌ని ఎగువ రాష్ట్రాలు అడిగితే చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెబుతారు

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్ర‌భుత్వంతో చీక‌టి ఒప్పందం
పాల‌మూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌పై కేసీఆర్‌తో అన‌ధికారికంగా బాబు ఒప్పందాలు చేసుకున్నారా 
పాల‌మూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్త‌యితే కృష్ణా నీళ్లు రావ‌ని లిప్ట్ ఇరిగేష‌న్‌పై తొంద‌ర‌ప‌డుతున్న చంద్ర‌బాబు
జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ను ప్ర‌భుత్వం ధ‌న‌వ‌న‌రుల శాఖ‌గా మార్చారు. 
జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో ప‌రిపాల‌న విధానాల‌ను అట‌కెక్కించి ప్ర‌భుత్వ ధ‌నాన్ని ఆర్జించే విధంగా త‌యారైంది.
ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ అనుమ‌తులు లేకుండా ప్ర‌కాశం బ్యారేజీ లైటింగ్ కోసం దాదాపు రూ. 8 కోట్ల ప‌నుల‌ను క‌ట్ట‌బెట్టారు

కృష్ణా పుష్క‌రాల్లో అత్యంత ప్ర‌ధాన‌మైన దుర్గాఘాట్ ప‌నుల‌కు ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఎమ‌ర్జెన్సీ ప‌నుల కింద రూ. 100 కోట్ల ఎలా కేటాయిస్తారు
ప‌నుల‌కు క‌నీసం నామినేష‌న్ పిల‌వ‌క‌పోవ‌డం దారుణం.... కేవ‌లం టీడీపీ నేత‌ల లాభం కోస‌మే...
బాబు త‌న‌యుడు లోకేష్, ఇరిగేష‌న్ మంత్రి దేవినేని ఉమ ఇద్ద‌రు క‌లిసి జ‌ల‌వ‌న‌రుల శాఖ‌తో ప్ర‌జాధనాన్ని దోపిడీ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఇలా కార్య‌క్ర‌మాలు
జ‌ల‌వ‌న‌రుల శాఖ ద్వారా రైతాంగానికి మేలు క‌ల‌గ‌డం లేదు
ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప‌నులు మొద‌లు పెట్టి 2018 నాటికి పూర్తి చేయాలి
ఎడ‌మ కాలువ లిప్ట్ ఇరిగేష‌న్ స్కీంను ఉప‌సంహారించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
Back to Top