శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

నెల్లూరు:  శ్మశాన వాటికల్లో కనీస వసతుల కల్పనకై ప్రతిపక్ష శాశన సభ్యుడిగా తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. స్ధానిక 27 వ డివిజన్‌ పరిధిలోని జ్యోతినగర్‌ లో ప్రజాబాట కార్యక్రమాన్ని రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్ధానిక సమస్యలపై ప్రజలతో చర్చించి, పరిష్కారం కోసం అధికారులకు సూచనలు చేశారు. శ్మసాన వాటికకు ప్రహరి గోడ లేక పడుతున్న ఇబ్బందులను పరిశీలించి, 24 గంటల్లో ప్రహరీగోడ పనుల్ని ప్రారంభించి, 20 రోజుల్లో పూర్తి చేయ్యిస్తానని తెలియజేసారు. ఈ సంధర్బంగా రూరల్‌ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో కనీస వసతుల కల్పనకు తనవంతు ప్రయత్నం చేస్తానని ప్రతి పక్ష శాసన సభ్యుడిగా ప్రభుత్వం,ఎమ్‌.పి గ్రాంటు ,స్నేహితులు లేదా దాతల సహకారంతో  నిరంతరం శక్తికి మించి కృషి చే స్తున్నానని, వీటి అభివృధ్దికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని కోరారు. ఈ సంధర్బంగా ముస్లిం మత పెద్దలు తక్షణం స్పందించి 24 గంటల్లో ప్రహరిని ప్రారంభించడానికి తోడ్పడిన రూరల్‌ ఎమ్మెల్యే ను స్ధానిక ముస్లిం పెద్దలు అభినందించారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లాఅధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్‌ రెడ్డి, 27 వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ బూడిద పురుషోత్తం యాదవ్, నరసింహయ్య ముదిరాజ్, రాజేష్, శేఖర్, జావీద్, రఫి, సంధానీ, మున్నా, అల్లీ హుస్సేన్, అమీ జాన్, గౌస్‌ భాష, మస్తాన్‌ భాషా, ఏజాన్, రిజ్వాన్, దావూద్, సాధిక్, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top