బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం

బీసీ వర్గానికి మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉందని ఎమ్మెల్యే ముత్యాలనాయుడు అన్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టోలో బీసీ వర్గానికి బడ్జెట్‌లోనే ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. అది అవునో, కాదో ఆయనే చెప్పాలి. 2014–15 సంవత్సరంలో ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేశారో చెప్పారు.2015–1 కేటాయింపులు, ఖర్చులు చేశారో చెప్పారు. అయితే ఎక్కడ కూడా పొంతన కుదరడం లేదు. చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే బీసీ విద్యార్థుల చదువులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువుకు పూర్తిగా ఫీజులు చెల్లించేవారు. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు రూ.30 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. మిగతాది తల్లిదండ్రులు చెల్లించాలని  నిబంధనలు పెట్టారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువుకు దూరమవుతున్నారు. ఏదైతే ఏడాదికి బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయింపులు అన్నారు. ఈ ప్రకారం రూ.40 వేల కోట్లు కేటాయించాలని కోరుతున్నాను. ఈ బకాయిలు విడుదల చేయాలి.

Back to Top