అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాః రోజా

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జట్ సమావేశాలకు హాజరు అవుతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఆమె శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తన సస్పెన్షన్‌పై  న్యాయస్థానం ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. తన మాటలను వక్రీకరించారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. రోజాను తిట్టడం వల్లే పదవులు వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే అనిత భావించడం బాధాకరమన్నారు. గతంలో టీడీపీలో తనకు ఎదురైన పరిస్థితులే .... రేపు అనితకు కూడా ఎదురవుతాయని ఆమె వ్యాఖ్యానించారు. కాగా మహిళా పార్లమెంట్‌కు హాజరు కాకుండా తన హక్కులకు భంగం కలిగించారంటూ డీజీపీపై వేసిన ప్రయివేట్‌ కేసు ఇవాళ గన్నవరం కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆమె గన్నవరం కోర్టుకు హాజరయ్యారు.
Back to Top