శ్రీకాకుళంః కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైయస్ జగన్ కొండంత అండగా నిలిచారు. వారు అనుభవిస్తున్న నరకయాతనను చూసి జననేత చలించిపోయారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే.....బాబు ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చాడు. ఆరోగ్యశ్రీ పథకం దివంగత నేత ప్రియతమ నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి స్వప్నం. ఆ పథకాన్ని నాన్నగారు ఒక లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి రెండో లెవల్‌కు నేను తీసుకెళ్తానని గట్టిగా చెబుతున్నా.. ప్రతీ కిడ్నీ పేషంట్‌కు మాటిస్తున్నా.. ఒకసారి మాత్రలు తినే పరిస్థితిలో మీరున్నారంటే నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తా.. ఏ పేదవాడు కూడా మందులు తినడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి రాకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి ఉండకూడదు. మందులు మొదలు పెట్టిన వెంటనే నెలకు రూ. 10 వేల ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
ఎక్కడైతే కిడ్ని పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారో... ప్రకాశం, ఉద్ధానం, నందిగామ అక్కడ కావొచ్చు. ప్రైమెరీ హెల్త్ సెంటర్లు లేక పీహెచ్‌సీ సెంటర్‌ల వద్దనే డయాలసిస్ సెంటర్‌లు పెట్టిస్తాం. ఇవాళ ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డయాలసిస్ చేయించుకోవడానికి టెక్కలికి పోవాలంటే 80 కి.మీ, విశాఖకు పోవాలంటే రూ. 200 కి.మీ ఆ పరిస్థితి పోవాలి. ఇటువంటి పరిస్థితి ఉన్న మండలాలు, గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్‌లను మెరుగుపర్చాలి. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లలోనే డయాలసిస్ యూనిట్ తీసుకురావాలి. ఇక్కడి నుంచి కేవలం బోరివంగ ఒక్క కి.మీ దూరంలోనే ఉంది. ఇలా చేస్తే ప్రతీపేదవాడు సంతోషపడతాడని వైయస్ జగన్ వారిలో ధైర్యం నింపారు.