వైయస్‌ జగన్‌ను కలిసిన హోదా సాధన కమిటీ నేతలు


గుంటూరు: వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక హోదా సాధన కమిటీ నేతలు కలిశారు. గుంటూరు టౌన్‌లో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను కమిటీ నాయకులు బుధవారం కలిసి హోదా పోరాటాన్ని ముందుకు నడిపించాలని కోరారు. ప్రత్యేక మోదా సాధనకు వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాన్ని సాధన కమిటీ నేతలు ప్రశంసించారు. మీ పోరాట ఫలితంగానే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని వారు గుర్తు చేశారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలను కలుపుకొని హోదా పోరాటాన్ని సారధ్యం కొనసాగించాలని కోరారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టే అమరణ నిరాహార దీక్షకు తాము కూడా ఢిల్లీ వెళ్లి మద్దతు తెలుపుతామని ప్రత్యేక హోదా సాధన కమిటీ నేతలు వైయస్‌ జగన్‌కు తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top