సోమ‌వారం స‌భ‌లో ఉత్కంఠ‌

హైద‌రాబాద్‌) శాస‌న‌స‌భ‌లో సోమ‌వారం ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను అవ‌మాన ప‌రిచే విధంగా స‌భ‌ను న‌డిపించాల‌ని తెలుగుదేశం పార్టీ నిర్ణ‌యించుకొంది. అదే బ‌ల‌వంతంగా అమ‌లుచేసేందుకు కంక‌ణం క‌ట్టుకొంది. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై రేపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రశ్నోత్తరాలనంతరం ప్రివిలేజ్‌కమిటీ నివేదికను చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు సమర్పించే అవ‌కాశం ఉంది. దాన్ని స‌భ కు తెలియ‌చేసి, స్పీక‌ర్ త‌దుప‌రిచ‌ర్య‌ను ప్ర‌క‌టించ‌వ‌చ్చు. మ‌రో వైపు హైకోర్టు స్టే ఉత్తర్వులపైనా కూడా అసెంబ్లీ చర్చించనున్నట్టు సమాచారం.

Back to Top