అమరావతి: అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చిస్తే ఎక్కడ హెరిటేజ్ మోసాలు బయటపడుతాయోనని ప్రభుత్వం పారిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై సభలో చర్చకు అనుమతించకుండా ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఆమె తప్పుపట్టారు. సభ వాయిదా అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో 1992 మంది రైతులు ఆత్యహత్యలు చేసుకున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డుపై పారేస్తున్నారు. జీఎస్టీ బిల్లుపై ఎవరైనా అడ్డు చెబితే దాని గురించి మాట్లాడాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. రైతు సమస్యలపై చర్చించాలంటే సభను వాయిదా వేయించుకొని పారిపోయారు. పీవీ సింధుపై వీరికొక్కరికే ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా సింధును అభినందించాం. రైతు సమస్యలపై చర్చిస్తే ఎక్కడ హెరిటేజ్ మోసాలు బయటపడుతాయోనని చంద్రబాబు పారిపోయారు. పక్కపార్టీ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నారు. నాడు ఎన్నికల సమయంలో రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు తీరు రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గురించి పట్టించుకోకుండా గొప్పలు చెప్పుకోవడం దారుణం. నాలుగు సార్లు ఓడిపోయిన చంద్రమోహన్‌రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిని చేయడం సిగ్గు చేటు. కేంద్రం మిర్చి రైతుకు రూ.3 వేలు ఇస్తున్నప్పుడు మీరు రూ.5 వేలు ఇచ్చి ఉంటే బాగుండేంది. ఇప్పటికైనా కళ్లు తెరచి రైతులను ఆదుకోకుంటే వైయస్ జగన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ప్రభుత్వం మెడలు వంచుతాం.