- కేసీఆర్‌కు రూ. 500 కోట్ల ముడుపులు
- బాబు సీఎంగా ఉండడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం
- వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు జీవితం... చిప్పకూడు తప్పదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో విలేకరుల సమావేశం మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోల టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని ఆనాడు ప్రగల్భాలు పలికిన తెలంగాణ సీఎం కేసీఆర్... 14 నెలలుగా ఎందుకు చార్జ్ షీట్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావుకు రూ. 500 కోట్లు, గోదావరి నది ప్రాజెక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించకుండా ఉండేందుకు కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని బాబుపై ధ్వజమెత్తారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
- పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి అమరావతికి ఎందుకు వచ్చారు బాబు. సచివాలయ ఉద్యోగులకు ఎందుకు అమరావతికి రప్పించారు.
- చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఓటుకు నోటు కేసు భయమే ఎక్కువ. జైలు జీవితం... చిప్పకూడు తనకు తప్పదనే చంద్రబాబు కేంద్రంపై సాగిలపడి, కేసీఆర్ కాళ్లు పట్టుకొని ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కారు
- 14 నెలలుగా కేసీఆర్ చార్జ్ షీట్ వేయలేదు కాబట్టి రూ. 500 కోట్లు అందాయి అనుకోక తప్పని పరిస్థితి
- నేను నిప్పు... నా రాజకీయ జీవితమంతా అత్యంత సచ్చిలతతో నడిచిందన్నావ్ ఇప్పుడు ఏమైంది బాబు నీ నిప్పు
- బస్సుల జాతీయకరణలో చిన్నమాట హైకోర్టు ప్రకటిస్తే ఆనాటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు
- భారతదేశంలో ఒక రైలు ప్రమాదం జరిగితే ఆనాటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు.
- ఎన్టీఆర్ హయంలో ముషీరాబాద్ నుంచి ఎన్నికైన మంత్రి రామచంద్రరావు రూ. 10 వేల లంచం తీసుకున్నారన్న ఆరోపణతో రామరావు ఆ మంత్రిని తొలగించారు.
- భారతదేశంలోనే అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు అని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే స్వచ్ఛంధ సంస్థ ప్రకటించింది
- ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఎందుకు రాజీనామ చేయరు
- చంద్రబాబు అంత పనికిమాలిన ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయల్లోనే ఏవరు లేరు
- నాలాంటి నిప్పులాంటి మనిషి సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అత్యంత బాధకరమని చంద్రబాబు అనడం సిగ్గుచేటు
- తెలుగుజాతి మాత్రం చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉండడం తమ దౌర్బాగ్యమని అనుకుంటుంది
- మోసం, వంచన, కపటం తప్ప మరే నైతికత లేనటువంటి వ్యక్తి చంద్రబాబు. ఏసీబీ ప్రకటించిన తీర్పుపై చంద్రబాబు ఆప్పీలుకు పోకపోతే నిజంగా నిప్పు అని నమ్ముతారు
- కేసు నుంచి ఎలా బయటకు రావాలన్న ఆలోచన చేయడానికే నేడు తిరుపతి సమావేశాన్ని రద్దు చేసుకొని బాబు విజయవాడ వెళ్లారు
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య లావాదేవీలు ఏంటి? కేసీఆర్ రూ. 500 కోట్ల లంచం తీసుకున్నారా..?
- కృష్ణా, గోదావరిలపై మీరు ఏరకమైన ఆనకట్టలైన కట్టుకొండి నన్ను మాత్రం ఈ కేసు నుంచి రక్షించండి అని బాబు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారు
- ఓటుకు నోటు కేసులో జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు, సీబీఐతో విచారణ జరిపించాలని వైయస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంది
- ఔటర్ రింగ్‌రోడ్డుపై ఒక్క ఆరోపణ చేయగానే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించారు
- ఇన్ని ఆరోపణలు వస్తున్న చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ వేసుకోరు
- గోదావరి, కృష్ణకు వచ్చే వరదల కంటే ఏపీలో అవినీతి వరద పొంగిపోర్లుతుంది. అవినీతిని చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు
- తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టే డిండి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పోరాటం చేశారు
- ఏపీకి ఎలాంటి విఘాతం కలిగించే పనులు తెలంగాణ ప్రభుత్వం చేసినా దానిని వ్యతిరేకిస్తాం
- ప్రత్యేక హోదా విషయంలో ఎవరితోనైనా వైయస్సార్‌సీపీ కలిసి పోరాటం చేస్తుంది