హైదరాబాద్‌ పేలుళ్ల మృతులకు షర్మిల సంతాపం

వాడపల్లి (నల్గొండ జిల్లా), 23 ఫిబ్రవరి 2013: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో ‌ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రీమతి షర్మిల సంతాపం తెలిపారు. నల్గొండ జిల్లా వాడపల్లిలో శనివారం ఉదయం 72వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన ఆమె మృతుల ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు దానితో అంటకాగుతూ పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు వ్యవహార శైలికి నిరసనగా శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు మేమున్నామంటూ భరోసానిచ్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ పాదయాత్ర చేస్తున్నారు. కాగా, మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది.‌ శనివారం రాత్రికి శ్రీమతి షర్మిల పులిపాడు క్రాస్ వద్దకు చేరుకుని అక్కే బస చేస్తారు.
Back to Top