గురువారానికి షర్మిల పాదయాత్ర 806 కి.మీ.లు

నాదర్‌గుల్‌ (రంగారెడ్డి జిల్లా), 13 డిసెంబర్‌ 2012: ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానితో అంటకాగి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటి షెడ్యూల్‌ పూర్తయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల షెడ్యూల్‌ ప్రకారం ఇబ్రహీంపట్నం మండలంలోని నాదర్‌గుల్‌ చేరుకున్నారు. దీనితో శ్రీమతి షర్మిల మొత్తం 57 రోజుల పాదయాత్రలో మొత్తం 806 కిలోమీటర్లు నడిచారు. రాత్రికి నాదర్‌గుల్‌లో ఆమె విశ్రాంతి తీసుకుంటారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చేందుకు శ్రీమతి షర్మిల ఈ చరిత్రాత్మకమైన సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్‌ 18 న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకూ వైయస్‌ఆర్‌ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసిన శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్నారు.
Back to Top