వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు

విజయనగరంః టీడీపీ పాలనలో విసుగెత్తిపోయిన ప్రజలు  జననేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే తమకు మేలు జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. వైయస్‌ర్‌సీపీలోకి రోజురోజుకు పెరుగుతున్న భారీ చేరికలే దీనికి తార్కాణం. వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీల నేతలే కాక మండల స్థాయి నాయకుల నుంచి  కార్యకర్తలు వరుకు పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా  వైయస్‌ జగన్‌ సమక్షంలో  గుర్ల మండలం జమ్ముపేట గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి.వారికి ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాతికేళ్లుగా టీడీపీలో ఉన్నా ఒక పథకంలో కూడా లబ్ధి  చేకూరలేదని గ్రామస్తులు అన్నారు. తమ పొలాలకు రావాల్సిన తోటపల్లి కాల్వ నీళ్లు కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని జననేత హామీ ఇచ్చారు.
 
Back to Top