ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఘన స్వాగతం

త్తెనపల్లి: వైయస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మొట్టమొదటి సారి సత్తెనపల్లి పట్టణంలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఆయనకు పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌నాగుర్‌ మీరాన్‌ నేతృత్వంలో వైయస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం సుబ్బారెడ్డిని పూల మాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు బాసు లింగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కళ్ళం వీరభాస్కర రెడ్డి, మైనార్టీ సెల్‌జిల్లా అధ్యక్షులు సయ్యద్‌మహబూబ్, ఎస్సీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాస్,పార్టీ జిల్లా కార్యదర్శులు గార్లపాటి ప్రభాకర్, కొత్తా భాస్కర్, సేవాదళ్‌జిల్లా కార్యదర్శి సయ్యత్‌ఖాజా, రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షుడు ఏపూరి శ్రీనివాసరావు, పట్టణ అధికార ప్రతినిధి ఎస్‌ఎమ్‌యూనస్, యూత్‌సెల్‌పట్టణ అధ్యక్షుడు అచ్యుత్‌శివప్రసాద్, మైనార్టీ సెల్‌పట్టణ అధ్యక్షుడు నాగుర్‌బాషా, సేవాదళ్‌పట్టణ అధ్యక్షుడు ఇసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్‌పట్టణ అధ్యక్షుడు తుమ్మల వెంకటేశ్వరరావు, ప్రచార కమిటీ ఫట్టణ అధ్యక్షులు శిరిగిరి వెంకట్రావు, కౌన్సిలర్లు షేక్‌మహ్మద్‌గని, పెద్దింటి వెంకటేశ్వర్లు(చిట్టి), పార్టీ నాయకులు భవిరిశెట్టి సుభ్రమణ్యం, మస్తాన్, ఎద్దులదొడ్డి శ్రీనివాసరావు, బుడగాల సుబ్బారావు, కలి, యాసారపు విజయ్‌కుమార్, తదితరులు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top