జ‌న‌నేత‌కు ఘ‌న‌స్వాగ‌తం

అశ్వారావుపేట‌: ఖ‌మ్మం జిల్లా అశ్వారావుపేట‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ముంపు మండ‌లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏపీలో విలీన‌మైన కుక్కునూరు మండ‌ల ప‌ర్య‌ట‌న‌కు అశ్వారావుపేట మీదుగా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా బ‌స్టాండ్ సెంట‌ర్‌లో అభిమానుల కోరిక మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ మహానేత  వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పోటీప‌డ్డారు. వైయస్ జగన్ కుక్కునూరు మండ‌ల ప‌ర్య‌ట‌న ముగించుకొని బుధ‌వారం రాత్రి బూర్గంపాడు మండ‌లం మోరంప‌ల్లి బంజ‌ర‌, కొత్త‌గూడెం, ఖ‌మ్మం మీదుగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. మోరంప‌ల్లి బంజ‌ర‌లో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు. 
Back to Top