ఉండిలో జనహారతి


– వైయస్‌ జగన్‌కు నియోజకవర్గంలో ఘన స్వాగతం
– ఎదురెళ్లి బాధలు చెప్పుకుంటున్న జనం
– నీటి ఎద్దyì పై మొరపెట్టుకుంటున్న స్థానికులు
– మంచి రోజులు వస్తాయని జననేత హామీ
పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి ఎటు చూసినా జనమే జనం. ఏ గ్రామానికి వెళ్లిన జననేతకు ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. గురువారం ఉదయం వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ఉంగటూరు నియోజకవర్గం నుంచి ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆరేడు వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహారాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, స్థానికులు రాజన్న బిడ్డకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఉప్పులూరు క్రాస్‌ రోడ్డు, పాములపర్‌ుర, వెంకటరాజుపురం మీదుగా పెదకాపవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.  

అడుగులో అడుగు వేస్తూ..
 మండుటెండ.. భానుడి భగభగలకు ప్రజలు బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. అయినా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంట ప్రజలు గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని కదులుతున్నారు. జననేత అడుగులో అడుగు వేస్తున్నారు. ఉక్కపోతకు చెమటలు కక్కుతున్నా.. పట్టించుకోకుండా జగన్నను చూసిన ఆనందంలో అలసట మరిచిపోతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగస్తులవుతున్నారు.  ప్రజాసంకల్ప పాదయాత్ర బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. దారిపొడవునా యువత ఉత్తుంగ తరంగాలై జననేత వెంట కదిలారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు జగనన్నకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయనతో మాట్లాడేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ఉవ్విళ్లూరారు. జయహో జగన్‌ అంటూ నినదిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ప్రజలు జననేత వద్ద మొరపెట్టుకుంటున్నారు. వారి సమస్యలు సావధానంగా వింటున్న వైయస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేసి గోదావరి, కృష్ణా జలాలను తరలిస్తానని, దాహం తీర్చుతానని హామీ ఇస్తున్నారు. 
Back to Top