గౌరీలంకేష్ హ‌త్య‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల నిర‌స‌న‌

క్రోసూరు (మంగ‌ళ‌గిరి):

 నిజాల‌ను నిర్భ‌యంగా, నిస్వార్థంగా వార్తలు సమాజానికి అందించే జర్నలిస్టులపై దాడులు, హత్యచేయటాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం స్ధానిక అంబేద్కర్‌ విగ్రహసెంటర్‌ లో ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేష్‌ ను ఇంటి వద్ద కాల్పులు జరిపి హత్యచేయాటాన్ని మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర‌సించింది. ఈ సందర్భంగా పార్టీనాయకులు నారుశ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో∙జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.గతంలో చిలకలూరిపేట జర్నలిష్టు హత్య, చీరాల జర్నలిస్టుపై దాడి, అదేవిధంగా బెంగుళూరు లో ప్రముఖ గౌరీలంకేష్‌ను హత్య విచారకరమని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.పత్రికా స్వేఛ్చపై గొడ్డలిపెట్టని అన్నారు. ఫోర్తు ఎస్టేట్‌ను కాపాడాల్సిన ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాలంటే పెట్టలేదన్న సత్యాన్ని గ్రహించాలన్నారు. జోహార్‌ గౌరీలంకేష్, అంటూ నినానాదలు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top