ఎన్నిక‌ల హామీల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం

పెనుగంచిప్రోలు: ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిసామినేని ఉదయభాను విమర్శించారు. గురువారం ఆయన ముండ్లపాడు గ్రామంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మిర్చికి గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను అధికారంలోకి వస్తే రైతుల కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తానని, రైతుల ఉత్పత్తులు ప్రభుత్వమే కొంటుందని ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో సాగునీరు కూడా కొనుక్కునే దుస్థితి ఏర్పడిందన్నారు.కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు,  పార్టీ జిల్లా కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, మాజీ ఎంపీపీ గూడపాటి శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు గుంటుపల్లి వాసు, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top