గవర్నర్‌ వెంటనే రాజీనామా చేయాలి

రొద్దం:రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఇద్దరు కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన గవర్నర్‌ వేంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై మండ్డి పడ్డారు. చంద్రబాబు నైతిక విలువలు గురించి ఎప్పుడు మాట్లాడుతాడని అయితే ఆయన అవేవీ పాటించడన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వారి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే అక్కడ రాజకీయ వ్యభిచారమని మాట్లాడిన పెద్దమనిషి ఈయన చేస్తున్నదేంటని నిలదీశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీఫాం ఇస్తేనే వారు తమ పార్టీ నుంచి గెలుపొందిన విషయం గుర్తించు కోవాలన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

Back to Top