బెల్ ప్రాజెక్ట్ ను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

వెంకటగిరి:

 మన్నవరం బెల్ ప్రాజెక్ట్‌తోనే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమైన మన్నవరం ప్రాజెక్ట్‌ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌ను విస్మరించడంతో పాటు తరలించేందుకు ప్రయత్నించడంపై స్థానికంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బెల్ ప్రాజెక్ట్ ను మన్నవరంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 16న పాదయాత్ర మన్నవరం చేరుకుంటుందని రాఘవేంద్రరెడ్డి చెప్పారు. ముగింపుసభకు పార్టీ  కీలకనేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి  పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top