పేదలకు రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి

హైదరాబాద్ః పేదలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా డిమాండ్ చేశారు. కడపకు 4326 ఇళ్లు శాంక్షన్ అయ్యాయని హౌసింగ్ అధికారులు చెప్పారని అమ్జద్ బాషా తెలిపారు. వాటికి సెంట్రల్ అసిస్టెన్స్ కింద లక్షా 50 వేలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.80 వేలు వస్తుందని అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఐతే, బ్యాంకుల నుంచి 2 లక్షలు లోన్ తీసుకోవాల్సి వస్తుందని అధికారులు అంటున్నారని...పేద ప్రజలకు బ్యాంక్ షూరిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ల అకౌంట్ లో డైరక్ట్ గా డబ్బులు వేసేలా చూడాలన్నారు.

Back to Top