ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే

హైదరాబాద్ః  అసెంబ్లీ కమిటీ హాల్ లో ఏపీ పీఏసీ సమావేశమైంది.  పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈసమావేశానికి సభ్యులతో పాటు అడిట్, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ, ఎక్సైజ్ అంశాలపై కమిటీ సమీక్షించింది. గత పీఏసీ ఇచ్చిన నివేదికలపై  ఏం చర్యలు చేపట్టారో సమాధానం చెప్పాలని కమిటీ అధికారులను నిలదీసింది. కమిటీకి సరైన సమాచారం ఇవ్వకపోతే సహించేది లేదని ఈసందర్భంగా అధికారులను హెచ్చరించింది. పీఏసీ సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలని కమిటీ అభిప్రాయపడింది. వాటిపై ఏమి చర్యలు తీసుకున్నారో పీఏసీకి, అసెంబ్లీకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. 


గత నివేదికలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందన్నదానిపై చర్చించినట్లు పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా తదుపరి మీటింగ్ లో చేపట్టాల్సిన ప్రణాళిక చర్యల గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. పీఏసీ చట్టపరంగా నిర్వర్తించాల్సిన బాధ్యతను పూర్తి చేస్తుందని, ఆవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని బుగ్గన తెలిపారు. 

Back to Top