<br/>హైదరాబాద్)) తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య జరిగిన ఎంసెట్ పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపాలని తెలంగాణ రాష్ట్ర వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.. సంబంధిత అధికారులపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుంచి డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్ధుల భవిష్యత్తుతో చలగాటం ఆడిన వారిని వదిలి పెట్టొద్దని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోందని అదేరీతిలో విద్యార్ధులను, విద్యార్ధుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.