కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వం

కడప వైయస్‌ఆర్‌ సర్కిల్‌: టిడిపి ప్రభుత్వం కార్మికులను విస్మరించడం తగదని రాయలసీమ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కంచుపాటి తిరుపాల్‌ తెలిపారు.  279 జీవో రద్దు చేయాలని కోరుతూ కార్పొరేషన్‌ కార్యాలయం నుండి ర్యాలీగా చేపట్టి నగరంలోని సంధ్య సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... కార్మికుల జీవితాలను నాశనం చేసేందుకే చంద్రబాబు 279 జీవో తీసుకొచ్చాడన్నారు.   దాదాపు రెండు సంవత్సరాలుగా 279 జీవోను రద్దు చేయాలని కార్మికులు అందోళనలు చేస్తున్న కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కార్పొరేట్,  ప్రైవేట్‌ సంస్దల ఆర్దిక లాభాలే ద్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తు వారికి కొమ్ముకాయడం దారుణమన్నారు. మున్సిపల్‌ కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా మున్సిపాలిటీలను, కార్పొరేషన్‌లను పెట్టబడిదారులకు అప్పగించాలనుకోవడం కార్మికుల కడపు కొట్టడమేనన్నారు. 151 జీవో ప్రకారం పెరిగిన వేతనాలను చెల్లించాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. సంస్కరణల పేరుతో కార్మికులను రోడ్లపాలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం 279 జోవోను రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top