తాగునీటి ఇబ్బందులకు ప్రభుత్వానిదే బాధ్యత

కర్నూలుః వైఎస్సార్సీపీ నగర ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ సుంకేశుల బ్యారేజీలో వాటర్ కెపాసిటీని పరిశీలించారు. సుంకేశుల నుంచి మూడు నెలలు మాత్రమే ప్రజలకు తాగునీరుకు అవకాశముందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. తాగునీటికి ఇబ్బంది అవుతుందని తాము కలెక్టర్ కు ముందే చెప్పామని...ఐనా వినకుండా పొలాలకని  4వేల క్యూసెక్కులు  నీళ్లు వదిలారని ఫైరయ్యారు. పొలాలు వేసుకోవద్దని ముందే చెప్పినా వినకుండా వేసుకున్నారని, వారికోసం నీళ్లు వదలడం అన్యాయమన్నారు.  

7 లక్షల జనాభా ఉన్న కర్నూలు ప్రజల తాగునీటి సమస్య గురించి ఆలోచించకుండా పొలాలకు నీరివ్వడం దారుణమన్నారు. మూడు నెలల్లోపు వర్షాలు రాకుంటే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడితే అందుకు  ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.  తెలంగాణ మంత్రి హరీష్ రావును  శనివారం కలిసి వారు చేసే నీటి చౌర్యాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ఎస్వీ చెప్పారు.  తుంగభద్ర  నుంచి సుంకేశులకు 1 టీఎంసీ నీరు రావాల్సింది ఉందని, అందుకనుగుణంగా మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

To read this article in English:  http://goo.gl/pgKjBy 

Back to Top