ప‌వ‌న్‌.. నీవు పెయిడ్ ఆర్టిస్టా..!


విజ‌య‌వాడ‌) సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల్ని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ అధ్య‌క్షుడు గౌత‌మ్ రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. అస‌లు చంద్ర‌బాబు అవినీతిచేస్తూ ప‌ట్టుబ‌డితే ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా ఫోన్ ట్యాపింగ్ గురించి ఉప‌న్యాసాలు దంచ‌టాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓటుకి కోట్లు కుంభ‌కోణం వెలుగు చూసి 35 రోజులు గ‌డిచాక‌, ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇంత కాలం త‌ర్వాత వేరే ఎవ‌రో స్క్రిప్ట్ రాసి ఇస్తే దాన్ని చ‌దివి వెళ్లిపోయార‌ని గౌత‌మ్ అభిప్రాయ ప‌డ్డారు. అస‌లు ఇంత‌కీ ప‌వ‌న్ ప్రెస్ మీట్ కు క‌థ‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం చంద్ర‌బాబే అని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ ప‌వ‌న్ క‌ళ్యాన్ సినీ ఆర్టిస్టా, లేక పెయిడ్ ఆర్టిస్టా..! అని గౌతమ్ సందేహం వ్య‌క్తం చేశారు. 
Back to Top