వసంతపురం క్రాస్ చేరిన మరో ప్రజాప్రస్థానం

అనంతపురం:

మహానేత వైయస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి అయిన షర్మిల సాగిస్తున్న మరో ప్రజాస్రస్థానం శనివారం సాయంత్రానికి గరుడంపల్లి మీదుగా వసంతపూర్ క్రాస్ చేరుకుంది. స్వల్ప జ్వరం కారణంగా శనివారం నాటి యాత్రను ఆరు కిలోమీటర్లకు కుదించారు. నడిచి వస్తున్న షర్మిలకు గ్రామగ్రామానా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈనెల 18న మొదలైన మరో ప్రజాప్రస్థానం ఇప్పటివరకూ 38 గ్రామాలలో 137 కిలోమీటర్లు సాగింది.  యాత్రలో ఆమె వెంట ఎమ్మల్యే గుర్నాథరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు. షర్మిల పాదయాత్రను చిగిచర్ల వరకు కుదించినట్లు పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు. వసంతపూర్ క్రాస్  గ్రామస్థులు షర్మిలకు మేకపిల్లను బహుకరించారు.

తాజా వీడియోలు

Back to Top