గంగిరెడ్డి పాలెం నుంచి షర్మిల యాత్ర

గుంటూరు, 02 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు గుంటూరు జిల్లా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఆమె పాదయాత్రగా వెడుతున్న దారులన్ని జన సమూహాలతో నిండిపోతున్నాయి.  శ్రీమతి షర్మిల శనివారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని గంగిరెడ్డి పాలెం నుంచి యాత్రను ప్రారంభించారు. రాజుపాలెం మీదుగా ఆమె భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడినుంచి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల మీదుగా సాగుతారు. అనంతరం బస చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.

Back to Top