గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ పోస్టర్ల ఆవిష్కరణ

వైయస్సార్ కడప:

 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి ...రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం పోస్టర్లను జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. 


గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే ఆంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. 

Back to Top