<strong>మహబూబ్‌నగర్::::::-: </strong>శ్రీమతి షర్మిల పాదయాత్ర సందర్భంగా గాయపడి చికిత్స పొందుతున్న అభిమాని జగన్‌ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వస్తుండగా శ్రీమతి విజయమ్మకు ఈ విషయం తెలిసింది. దీనితో ఆమె మహబూబ్‌నగర్ శివార్లలో ఉన్న ఎస్‌విఎస్ ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారంనాడు పాలమూరు విశ్వవిద్యాలయం వద్దకు రాగానే ఆ వర్శిటి ప్రాంగణం నుంచి కొందరు విద్యార్థులు రాళ్ళు, టమోటాలు, కోడిగుడ్లు విసిరారు. ఈ సందర్భంగా టమోటా మీద కాలు వేసిన జగన్ కాలు జారి కిందపడ్డాడు. అతని కాలుపై ఒక వాహనం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాన్వా సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. కాన్వాయ్ సిబ్బంది జగన్‌ను స్థానిక ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో చేర్చారు.