గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం జగన్‌తో సాధ్యం: సురేష్ బాబు

కడప: గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక వైయస్ అతిథి గృహంలో ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ నేడు మనం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే మహాత్మాగాంధీ లాంటి నిస్వార్థ నాయకులవల్లేనన్నారు. హింసాయుత ఉద్యమాలు చేసే వారు గాంధీజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరముందన్నారు. తమ పార్టీ గాంధీజీ ఆశయాల మేరకు శాంతియుత మార్గాన్ని అనుసరిస్తోందని, పార్టీ స్థాపించినప్పటి నుంచి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ చేసిన దీక్షలు, ఉద్యమాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ ఎస్‌బీ అంజాద్‌బాష మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం వచ్చినపుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పారని, ప్రస్తుత పాలకులు గ్రామ స్వరాజ్యాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరపలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం పేదలకు అండగా నిలబడాలని, వారి సంక్షేమానికి ప్రణాళికలు రూపొం దించాలన్నారు. అలా జరిగింది కేవలం  రాజశేఖరరెడ్డి హయాంలోనేనని తెలిపారు. అంతకుముందు వారు వన్‌టౌన్ సర్కిల్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాసీమబాబు, టీకే అఫ్జల్‌ఖాన్, మహమ్మద్ హఫీజుల్లా (కాల్‌టెక్స్), జీఎన్‌ఎస్ మూర్తి, పత్తి రాజేశ్వరి, పులి సునీల్, కరీముల్లా, వేణుగోపాల్‌రెడ్డి, ఆర్వీ రమణ, చల్లా కృష్ణయ్య, టీపీ వెంకట సుబ్బయ్య, కొండమ్మ, శ్రీలక్ష్మి, జింకా జయలక్ష్మి, షఫీ, చంద్ర, మున్నా తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శనీయుడు మహాత్మాగాంధీ: సుచరిత
గుంటూరు: మహాత్మాగాంధీ ప్రపంచానికే  ఆదర్శనీయుడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు అరండల్‌పేట ఐదోలైనులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం జాతిపిత త్యాగాలను ఎన్నటికీ మరువరాదన్నారు.  పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ గాంధీజీ అహింసావాదం నేడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిందన్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ ఆచరణలోకి తీసుకోవాలని సూచించారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ గాంధేయమార్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ నేటి యువత తప్పనిసరిగా గాంధీజీ జీవితాన్ని తెలుసుకుని, ఆయన బాటలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేత, ఏపీ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, నాయకులు షౌకత్, మందపాటి శేషగిరిరావు, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్‌బాషా, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, యువజన విభాగం నగర కన్వీనర్ ఎండీ నసీర్ అహ్మద్, పార్టీ నాయకులు తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఈపూరి అనూప్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, ఎస్సీసెల్ నగర కన్వీనర్ వై.విజయ్‌కిషోర్, మైనార్టీసెల్ నగర కన్వీనర్ మార్కెట్‌బాబు, సేవాదళ్‌నగర కన్వీనర్ పల్లపు శివ, కోటా పిచ్చిరెడ్డి, కోనూరు సతీష్‌శర్మ, పురుషోత్తం, మిన్నకూరి శంకర్‌యాదవ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ నాగేశ్వరరావు, పిల్లి నాగేశ్వరావు, నందిరాజు పాండురంగారావు, వలివేటి వెంకటరమణ, పసుపులేని శ్రీను, విద్యార్థి నాయకులు దర్శనపు శ్రీనివాస్, యు.నర్శిరెడ్డి, పాటిబండ్ల కిరణ్ పాల్గొన్నారు.

గాంధీజీకి అంబటి, ఆర్కే నివాళి
సత్తెనపల్లి: మహాత్మాగాంధీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ల రామకష్ణారెడ్డి ఘన నివాళులర్పించారు. సత్తెనపల్లి పట్టణంలోని లక్కరాజుగార్లపాడు సెంటర్, రామాలయం, మాదిపేట, కోనేరమ్మ గుడి, సబ్‌జైలు, క్రిస్టియన్ పేటలోని మహాత్మాగాంధీ విగ్రహాలకు, సాయిబాబా మందిరం వద్ద ఉన్న లాల్‌బహదూర్‌శాస్త్రి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేశారు. అనంతరం ఆయనకు ఘన నివాళులర్పించి మాట్లాడారు. గాంధీ పేరు వినగానే శాంతికి ప్రతిరూపమైన మానవత్వం, ప్రసన్నవదనం మన ముందు కదలాడుతుందన్నారు. ఆయన బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచమంతా సమస్యల పరిష్కారం కోసం గాంధీయిజాన్ని అనుసరిస్తారని కొనియాడారు.

ఖమ్మంలో..
ఖమ్మం: జాతిపిత మహాత్మాగాంధీ 143వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, సీఈసీ సభ్యులు బాణోత్ మదన్‌లాల్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. బ్రిటిష్‌వారి కబంధ హస్తాల నుంచి అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అన్నారు. గాంధీయిజాన్ని ప్రతి ఒక్కరు సందేశంగా తీసుకోవాలని, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు అదే మార్గాన్ని అనుసరించాలని కోరారు.  కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు చాగంటి వసంత, ఆధికార ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, బొబ్బిలి భరత్‌చంద్ర, పట్టణ కన్వీనర్ ఎస్.ఎ.ఎస్ అయుబ్, జిల్లా విద్యార్థి విభాగం నాయకులు అయిలూరి మహేష్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ తోట రామారావు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ గొల్లపూడి రాంప్రసాద్, యువజన విభాగం పట్టణ కన్వీనర్ దేవభక్తిన కిషోర్, రైతు విబాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ నాయకులు తేజావత్ వీరూనాయక్, లీగల్‌సెల్ జిల్లా కన్వీనర్ జె.పాపారావు, నాయకులు అప్పిరెడ్డి, అల్లూరి సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వర్లు, దోరేపల్లి రవికుమార్, సునిల్, సాంబయ్య, ఆరెంపుల వీరభద్రం, జమలాపురం రామకృష్ణ, ముక్తార్, పద్మజారెడ్డి, బాణోతు శారద, కృష్ణవేణి, షర్మిళ సంపత్, విజయ తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముని ఆశయసాధనకు కృషి
మహబూబ్‌నగర్: మహాత్మాగాంధీ ఆశయసాధనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా నేత ఎం.సురేందర్ రెడ్డి తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లాక్‌టవర్‌లోని గాంధీ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పిల్లలమర్రి రోడ్డులోని అంధుల పాఠశాల, ఏనుగొండలోని అనాథ శరణాలయంలో చిన్నారులకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు.  గ్రామాలు అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్న బాపూజీ సందేశాన్ని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ భీమయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంభు పుల్లయ్య శెట్టి, యువజన, మైనార్టీ విభాగాల జిల్లా కన్వీనర్లు ఆర్.రవిప్రకాశ్, సయ్యద్ సిరాజుద్దీన్, యువజన విభాగం పట్టణ కమిటీ కన్వీనర్ రవికిరణ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీ ఆశయాలకు యూపీఏ సర్కార్ తూట్లు
సంగారెడ్డి: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని వైయస్ఆర్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంగళవారం స్థానిక జెడ్పీ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గాంధీ చూపిన అహింసామార్గంలో నడుస్తూ దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. యూపీఏ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను అనుమతించి గాంధీ ఆశయాకు తూట్లుపొడుస్తోం దని విమర్శించారు. గాంధీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఓడీఎఫ్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలం కంది సమీపంలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులకు శ్రీధర్‌రెడ్డి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి, కొండాపూర్ మండల కన్వీనర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లేశం, మైనార్టీ నాయకులు ఖాదర్ హుస్సేన్, నాయకులు తుకారంగౌడ్, రమేశ్‌రెడ్డి, కృష్ణ,దత్తు, రాజశేఖర్‌రెడ్డి, బస్వరాజ్, వీరేందర్‌రెడ్డి, అసిఫ్, రహీం, రమేశ్‌గౌడ్, సుభాష్‌గౌడ్, నిఖిల్‌గౌడ్, రాంచరణ్‌రెడ్డి, బాబు, భవానీ ప్రసాద్, నాగరాజు, దావూద్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.

సుపరిపాలనతోనే బాపూజీ కలలు సాధ్యం: జనార్దన్
శంషాబాద్: సుపరిపాలనతోనే బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బి. జనార్దన్‌రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.  మహాత్ముడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని వైయస్ఆర్ సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ రాచమల్ల సిద్దేశ్వర్ అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ టి. కుమార్‌గౌడ్, పార్టీ నేతలు భాగ్య, నాగమణి, సాతంరాయి మాజీ ఎంపీటీసీ సభ్యుడు జె. నరేందర్, అక్రమ్‌ఖాన్, అశోక్‌యాదవ్, శివారెడ్డి, నజీర్‌ఖాన్, శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, పవిత్రసాగర్, సామెల్‌రాజ్, శ్రీధర్, శ్యామ్, రవీందర్‌గడ్, యాదగిరి, పాపిరెడ్డి, కరుణాకర్, పాండుృ చింటు తదితరులు పాల్గొన్నారు.

గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి
పెద్దఅంబర్‌పేట: దేశం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన జాతిపిత మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయున మాట్లాడుతూ ఏనాడు సత్యం పలకని చంద్రబాబు గాంధీ జయంతి రోజు పాదయాత్ర చేపట్టడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. తన ఉనికి కోసమే పాదయాత్ర చేస్తున్నాడు తప్ప ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కాదన్నారు. కిరణ్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు వాటిపై పోరాడకుండా వారికి సహకరించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మర్యాల రాజు, ఎం.ఏ.సత్తార్, యువజన విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పండుగల రాజు, గ్రామ కన్వీనర్ విజయేందర్‌రెడ్డి, నాయకులు చింటు, శ్యాంరాణా ముదిరాజ్, మోహన్, వెంకట్‌రెడ్డి, జంగయ్య, అంజయ్య, బాబురావు పాల్గొన్నారు.

Back to Top