భవిష్యత్ అంతా వైయస్సార్సీపీదే

క‌ర్నూలు

: భ‌విష్య‌త్తు అంతా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీదేనని, జ‌న‌మంతా ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెంటే ఉన్నార‌ని వైయ‌స్సార్ సీపీ నేత‌లు పేర్కొన్నారు. మైనార్టీసెల్ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శి బి.జ‌హీర్ అహ్మ‌ద్‌ఖాన్ ఆధ్వ‌ర్యంలో మాజీ కార్పొరేట‌ర్ దాదామియ్య‌తో పాటు ష‌ఫి, ర‌ఫి, జాకిర్‌, జుబేర్‌ల‌తో పాటు సుమారు వంద మంది యువ‌కులు వైయ‌స్సార్ సీపీలో చేరారు. స్థానిక రాయ‌ల్ ఫంక్ష‌న్ హాల్ ఆవ‌ర‌ణ‌లోని న‌గ‌ర పార్టీ కార్యాల‌యంలో పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వై.రామ‌య్య‌, మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీఈసీ మెంబ‌ర్ కొత్త‌కోట ప్ర‌కాష్‌రెడ్డి, క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త హ‌ఫీజ్‌ఖాన్‌, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ర‌హ్మాన్‌ల స‌మ‌క్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ.. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీలో చేరినట్లు చెప్పారు.  నమ్మి ఓట్లేసిన వారందరినీ బాబు నట్టేట ముంచాడని మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top