అధైర్యపడొద్దు..వచ్చేది మన ప్రభుత్వమే

అనంతపురంః రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, మనకోసం వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభయమిచ్చారు. ఎస్‌పీ కుంట సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బాగుకోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి భూములు పంపిణీ చేస్తే..వాటిని చంద్రబాబు సోలార్‌ ప్లాంట్లకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో పోరాటం చేస్తారని, వచ్చేది వైయస్‌ఆర్‌సీపీనే అని,  త్వరలో మనకు మంచిరోజులు వస్తాయని శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు.  
Back to Top