విజ‌య‌వాడ‌లో మెగా వైద్య శిబిరం ప్రారంభం

విజయవాడ: వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్బంగా గురువారం ఉదయం విజ‌య‌వాడ‌లోని వన్‌టౌన్‌ స్వాతి రోడ్డులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో 20 మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. రూ.5లక్షల విలువ గల మందులు ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పైలా సోమినాయుడు, పుణ్యశీల, శేఖర్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


Back to Top