()రిషికేష్ లో వైయస్ జగన్ ప్రత్యేకపూజలు
()రాష్ట్ర మేలు కోరుతూ హోమం
()సాధువులకు అన్నదానం చేసిన జననేత
ఉత్తరాఖాండ్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రిషికేష్ లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను వంచిస్తున్న పాలకుల కళ్లు తెరిపించాలని కోరుతూ గంగమ్మను కోరుకున్నారు. అనంతరం స్థానికంగా శారదపీఠం ఆశ్రమంలో వేదపండితులు, సాధువులకు వైయస్ జగన్ అన్నదానం చేశారు. ఈసందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలి, ఏపీకి ప్రత్యేకహోదా సిద్ధించాలని ఆకాంక్షిస్తూ వైయస్ అక్కడ హోమం నిర్వహించారు.
ఏపీికి ప్రత్యేకోహోదా సాధనే ధ్యేయంగా పోరాడుతున్న వైయస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే హోదాను సాధించుకునేందుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు పార్టీ నేతలతో కలిసి వైయస్ జగన్ న్యూఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. హోదాపై రాష్ట్రపతికి వినతిపత్రం అందించడం సహా వివిధ జాతీయ నాయకులను కలిసి మద్దతు కోరారు. అటుపిమ్మట అక్కడి నుంచి రిషికేషి వెళ్లారు.
అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చాతుర్మాస దీక్షలో వైయస్ జగన్ పాల్గొని గంగానదికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ తో పాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.