ఇద్దరికి ఆర్ధిక సహాయం అందజేత

ముండ్లమూరుః మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి సోమవారం ఆర్ధిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన ఆవులూరి నరేష్‌ గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అదే గ్రామానికి చెందిన గండి కృపానందం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకొంటూ ఇబ్బంది పడుతున్నాడు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ సూదిదేవర అంజయ్య ఈ విషయాన్ని వైఎస్సార్‌ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి దృష్టికి తీసుకెల్లడంతో ఆయన స్పందించి ఇరువురికి ఒక్కొరికి ’ 10 వేల రూపాయల చొప్పున ఇరవై వేల రూపాయల నగదును ఇచ్చారు. ఆ నగదును దర్శి లోని ఆ పార్టీ కార్యాలయంలో అంజయ్య వారిరువురికి అందజేశారు.

Back to Top