నర్సీపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 29న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తామన్నారు. నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ర్టం విడిపోవడానికి సోనియాగాంధీతోపాటు చంద్రబాబు కారణమమన్నారు. ప్రత్యేకహోదా వస్తే పన్ను రాయితీతోపాటు ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చాక అవినీతి చంద్రబాబు భరతం పడతామనిహెచ్చరించారు.