అవినీతి,అక్రమ పాలనపై దండయాత్ర చేస్తాం

 • బాబు కుటిల రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు
 • చంద్రబాబు నికృష్ట రాజకీయాలను ఎండగడుతాం
 • ప్రజల పక్షాన ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతాం
 • జైలు భయంతో బాబు హైదరాబాద్ నుంచి పారిపోయాడు
 • వైయస్ జగన్ పై వ్యక్తిగత దాడిని సహించేది లేదు
 • వైయస్ జగన్ ను విమర్శించడం తప్ప బాబు ముఠా చేసిందేమీ లేదూ
 • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి

 • హైదరాబాద్ః  వైయస్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ధైర్య‌, సాహ‌సాల‌తో బతికే వ్య‌క్తి కాబ‌ట్టే ఎక్క‌డా రాజీ లేకుండా ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. బాబు, సోనియాగాంధీలు క‌లిసి కుట్ర ప‌న్ని అన్యాయంగా పెట్టిన అక్ర‌మ కేసుల వ‌ల్లే వైయస్ జగన్  16 నెల‌లు జైలుశిక్ష అనుభవించారన్నారు. కానీ ఓటుకు నోటు కేసులో తెలంగాణలో అడ్డంగా దొరికిపోయిన బాబు మాత్రం... ఎక్క‌డ జైలుకెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందోన‌ని భ‌య‌పడి హైదరాబాద్ నుంచి పారిపోయి  రాష్ట్ర భ‌విష్య‌త్తును తాక‌ట్టు పెట్టారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తిగా మారి బాబు పాలన సాగిస్తున్నారని భూమన నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. 

  ఓటుకు నోటు వ‌ల్ల ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ నుంచి ఆంధ్రా ఉద్యోగుల‌ను ఉన్నపళంగా విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్పించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూమన చంద్రబాబుపై ఫైర్ అయ్యారు . వైయస్ జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త దాడి చేయ‌డం త‌ప్ప చేసిన అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం బాబుకు లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో చినీ చెట్ల‌కు నీళ్లిస్తున్నాం, మీరేం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. టీడీపీ రాకముందు ఆ చినీ చెట్లు ఎలా వ‌చ్చాయో వారు తెలుసుకుంటే బాగుంటుందన్నారు.  అస‌లు ఆ చినీ చెట్ల‌కు కాలువలు త‌వ్వి, ప్రాజెక్టులు క‌ట్టింది ఎవ‌రో తెలుసుకోవాలన్నారు. అస‌లు పులివెందుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క ప్రాజెక్టునైనా టీడీపీ క‌ట్టిందా అని భూమన ప్ర‌శ్నించారు. 

  అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం.... అన్యాయాల‌కు కాదు
  వైయ‌స్సార్‌సీపీ రాష్ట్రాభివృద్ధికి స‌హక‌రిస్తుంద‌ని, కానీ బాబు చేసే అన్యాయాలు, అక్ర‌మాలను మాత్రం సహించేది లేదని భూమన హెచ్చరించారు.    ప్రతిపక్షం అభివృద్ధికి సహకరించడం లేదని బాబు మాట్లాడుతున్నారని...అసలు బాబు అభివృద్ధి చేస్తే కదా సహకరించేదని భూమన చురక అంటించారు. బాబు చేస్తున్న తప్పుల‌ను స‌వ‌రించ‌డానికే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోరాడుతున్నార‌ని తెలిపారు. బాబు కుటిల రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 

  ప్ర‌భువు కోతియైనా ప్ర‌గాఢాల్ పందుల్‌
  సైనికుండు ప‌క్కిసేన ప‌శులు!
  ఏనుగులు, ఆశ్వాలు, ఎలుక‌లు, పిల్లులు
  విశ్వ‌దాభిరామ వినురావేమ‌!!

  అన్న ప‌ద్యం బాబు పాల‌న‌కు స‌రిగ్గా సరి ప‌డుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం చేయాల్సిన ప‌నులు ఒక్క‌టి కూడా చేయ‌కుండా కేవ‌లం వైయస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. చివరకు సంక‌ల్ప దీక్ష‌రోజు కూడా బాబు మాట తప్పారని అన్నారు. ప్ర‌త్యేక హోదాను తీసుకొస్తాం... రుణామాఫీ చేస్తాం... బెట్లు షాపుల‌ను ఎత్తివేయ‌డానికి కృషి చేస్తాం... నిరుద్యోగభృతి కల్పిస్తాం అని బాబు గుండెల మీద చేయివేసుకొని ప్రతిజ్ఞ చేస్తే బాగుండేదన్నారు. సంక‌ల్ప దీక్ష అన్న భావనే బాబులో లేదని భూమన దుయ్యబట్టారు. న‌రేంద్ర‌మోదీని వైయ‌స్సార్‌సీపీ విమ‌ర్శించ‌డం లేద‌నడం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. 

  రాజీనామా చేయించే దమ్ముందా బాబు..!
  డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ...మేము డ‌బ్బుల‌కు అమ్ముడు పోలేద‌ని చెప్ప‌డం విడ్డూరమన్నారు. బాబుకు ద‌మ్ముూ, ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని స‌వాల్ విసిరారు. వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడిగిన వంద ప్ర‌శ్న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి... ప్ర‌జ‌లు చెప్పిన స‌మాధానాల‌ను టీడీపీ అంద‌జేస్తామ‌న్నారు. టీడీపీ ఒక్క‌హామీని కూడా నెర‌వేర్చ‌లేదు కాబ‌ట్టే వైయ‌స్సార్ సీపీ నిరంత‌రం ఉద్య‌మాలు చేస్తుంద‌న్నారు.   రాజ‌కీయ కక్షసాధింపుతో  కాకుండా ప్ర‌జా పాల‌న‌ను కొన‌సాగించేంత వ‌ర‌కు వైయ‌స్సార్‌సీపీ పోరాడుతున్నారు.  చివ‌రికి దేవుడి పొలాల‌ను కూడా అమ్ముకునే నికృష్ట రాజ‌కీయాల‌ను టీడీపీ అవలంభిస్తోందన్నారు. టీడీపీ అన్యాయాల‌పై నిరంత‌రం వైయ‌స్సార్‌సీపీ దండ‌యాత్ర చేస్తుంద‌న్నారు. వైయస్ జగన్ ఉన్మాది అంటూ మంత్రులు మాట్లాడుతున్నారని...అసలు ఉన్మాది చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులేనని దుయ్యబట్టారు. 
Back to Top