మోసం చేస్తే ప్రజలు నిలదీస్తారనే భయం పుట్టాలి

  • అప్పుడే రాజకీయ నాయకులు ఆచితూచి హామీలిస్తారు
  • లేదంటే బాబు విమానం కొనిస్తానని కూడా చెబుతాడు
  • ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్
  • పశ్చిమ పర్యటనలో వైయస్ జగన్ 

  • పశ్చిమ గోదావ‌రి(ఏలూరు) :  వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అక్కడ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. స్థానిక ప్రజలు తమ కష్టాలను జననేతకు చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు వింటూ వాటిని పరిష్కరించేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి భరోసా కల్పిస్తున్నారు. 

    పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జననేత....మంగళవారం రాత్రి నల్లజర్ల మండలం పోతవరంలో వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం అధికార ప్రభుత్వానికి ఉండాలన్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే రోడ్డుపైనే నిలదీస్తారనే భయం రాజకీయ నాయకులకు కలగాలని, ఆ మేరకు ప్రజలు చైతన్యవంతం కావాలని  వైయస్ జగన్‌ పిలుపునిచ్చారు. 

    అప్పుడే నాయకులు ఆచితూచి హామీలిస్తారన్నారు. లేదంటే చంద్రబాబులాంటి నాయకుడు ప్రతి ఇంటికీ ఒక కారు లేదా విమానమే కొనిస్తాననే వాగ్దానాలు చేస్తాడని ఎద్దేవా చేశారు. అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.   వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను అందిస్తున్నామని, చంద్రబాబు హామీలు అమలు చేశాడా లేదా అన్న దానిపై ప్రజలే తేల్చుకోవాలన్నారు. 
Back to Top