సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన..ఉద్రిక్తత

అమరావతి: పెనుమాక సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన దిగారు. కూరగాయలు పారబోసి నిరసన తెలిపారు. సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు తాము నిరాకరించడంతో ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని పెనుమాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు, గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుసు మార్కెట్‌ యార్డు ఎదుట అన్నదాతలు ఆందోళనకు దిగారు. గ్రేడింగ్‌ పేరుతో మార్క్ఫెడ్‌ అధికారులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తు రైతులు నిరసన చేపట్టారు. కొంతమంది రైతులు భవనంపైకి ఎక్కి దూకుతామని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Back to Top