భూములు తీసుకున్నారు.. చేతులు దులుపుకున్నారు..

నష్టపరిహారం అందక పందలపాక వాసుల ఇక్కట్లు
న్యాయం జరపించాలంటూ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌కు వినతి
విశాఖః భూముల్ని తీసుకుని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని విశాఖ జిల్లా పందలపాక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ప్రజా సంకల్పయాత్రలో పందలపాక వాసులు వైయస్‌  జగన్‌ను కలిశారు. ఇండో టిబెటిన్‌ క్యాంప్‌ కోసం భూసేకరణ  చేశారని.. 72 ఎకరాలు భూముల్ని తీసుకుని పరిహారం  ఇవ్వకుండా నాలుగున్నర సంవత్సరాల నుంచి అధికారులు తప్పించుకుంటున్నారని వాపోయారు. భూములు లేక  జీవనోపాధి కోల్పోయి నానా ఇక్కట్లు పడుతున్నామన్నారు.  మంత్రి గంటా దృష్టికి కూడా అనేకమార్లు తీసుకెళ్ళామని అయినా న్యాయం జరగలేదన్నారు. ఎక్కడకు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో జగనన్నను కలిశామన్నారు. జగన్‌ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
 


Back to Top