వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నాం

జననేత ఎదుట కన్నీరు పెట్టుకున్న రైతులు
విశాఖ: వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నామని, మాకు న్యాయం చేయండి సారూ అని నర్సీపట్నం నియోజకవర్గ రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరుపెట్టుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేతను రైతులు కలిసి వారి సమస్యలు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భూమి కాగితాలు పెట్టి రూ. 20 వేలు లోన్‌ తీసుకున్నాం.. చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. నాలుగేళ్ల తరువాత రూ. 37 వేలు కట్టాలని బ్యాంక్‌ నుంచి నోటీసులు పంపించారని ఓ రైతు వాపోయారు. మాఫీ అన్నారు కదా.. మళ్లీ డబ్బులు కట్టమంటారేంటని బ్యాంక్‌ అధికారులను అడిగితే.. రుణమాఫీ కాలేదు డబ్బులు కట్టాల్సిందేనని చెబుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యను చెప్పుకున్నామని, న్యాయం చేస్తామన్నారన్నారు.  
Back to Top