జ‌న‌నేత హామీల‌పై రైతుల హ‌ర్షం

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల‌తో అండగా ఉంటామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల అన్న‌దాత‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. కోట వుర‌ట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు ప‌లు హామీలు ఇచ్చారు. జ‌న‌నేత హామీల‌ను రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం ప‌లువురు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..మ‌హానేత వైయ‌స్ఆర్ న‌ష్టాల్లో ఉన్న షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల‌ను ఆదుకుంటే.. చంద్ర‌బాబు వాటిని మూత‌ప‌డే స్థితికి తీసుకొచ్చార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నేత  చొక్కాకుల వెంక‌ట్రావ్ అన్నారు. రైతుల‌ను టీడీపీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని,  వైయ‌స్ జ‌గ‌న్ అధికారం చేప‌డితేనే  రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెద్దఎత్తున్న అవినీతికి పాల్ప‌డుతుంద‌న్నారు. విష జ్వ‌రాల‌తో గిరిజ‌న గ్రామాలు అలాడుతున్నన్నా చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప‌ట్ట‌డం లేద‌ని  విశాఖ జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్  నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాబు స‌ర్కార్‌కు  ప్ర‌జాసంక్షేమం ఆలోచ‌నే లేద‌న్నారు. ఈ స‌ర్కార్‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని రైతులు హెచ్చ‌రించారు. రానున్న‌ది రాజ‌న్న రాజ్య‌మే అని ధీమా వ్య‌క్తం చేశారు. 
Back to Top