బొజ్జల వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం

చిత్తూరు  : రైతులపై టీడీపీ అక్కసు మరోసారి బయటపడింది. సోమరిపోతు రైతులే వరి పంటను సాగుచేస్తారంటూ ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి  రైతుల మనోభావాలను దెబ్బతీశారు. అన్నం పెట్టే రైతన్నలను సోమరిపోతులతో పోల్చడంపై రైతు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నేతలు బొజ్జలపై మండిపడుతున్నారు.   చిత్తూరు కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశమైన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. 

గతంలో వ్యవసాయమే దండగ అంటూ చంద్రబాబు అన్నపూర్ణాంధ్రప్రదేశ్ గా పేరుగాంచిన ఏపీ పరువు తీశారు. రైతులపై టీడీపీకి ఉన్న ప్రేమ ఏపాటిదో వారు చేస్తున్న వ్యాఖ్యల బట్టే అర్థమవుతోంది. రుణాలు మాపీ గాక, పంటలకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే..వారిని ఆదుకోవాల్సిందిపోయి వారి భూములనే లాక్కొంటూ నడిరోడ్డున పడేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రైతుల సత్తా ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని రైతు సంఘాల నేతలంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ గల్లంతవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top