టీడీపీ పాలనలో రైతులకు తీరని అన్యాయం

రైతులను అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారు
ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి
తక్షణమే అరటి రైతులను ఆదుకోవాలిః వైఎస్ జగన్

పులివెందులః టీడీపీ పాలనలో రైతులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. రుణాలు మాఫీ కావడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇన్సూరెన్స్ చెల్లించడం లేదు. ఈప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను నాశనం చేస్తోందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈసందర్భంగా నల్లపురెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వైఎస్ జగన్ కూలిపోయిన అరటి చెట్లను పరిశీలించారు.  రైతు ఆదినారాయణను వైఎస్ జగన్ పరామర్శిచారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 


5లక్షల పెట్టుబడితో 3 ఎకరాల్లో పండించిన అరటి పంటంతా నేలమట్టమయిన నేపథ్యంలో ఆదినారాయణ తన గోడును జననేతకు చెప్పుకున్నారు. 
రైతులు పంటలు కోల్పోతుంటే ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. అధికారులు వచ్చి రాసుకొని పోతున్నారు తప్పితే...ప్రభుత్వం రైతులకు పైసా ఇచ్చిన పాపాన పోవడం లేదని ఆగ్రహించారు. రైతులను ఆదుకునే విషయమై ప్రభుత్వం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అరటి రైతులకు పరిహారాన్ని రూ.50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ చెప్పారు. 


 


To read this article in English:  http://bit.ly/277o46L 


Back to Top