'రాజధాని ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు'

గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులు వారివారి పోలాల్లో పంటలు వేసుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ఆ క్రమంలో సీఆర్‌డీఏ అధికారులు రైతులకు ఏలాంటి ఆటంకాలు కలిగించవద్దుంటూ ఏప్రిల్ 9న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీలను రైతులకు అందజేశారు.

మంగళవారం మంగళగిరి మండలంలోని బేథపూడి, నిడమర్రు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రాజధాని నిర్మాణానికి భూములివ్వని 230 మందిరైతులను కలుసుకొని,  కోర్టు ఉత్తర్వు కాపీలు అందజేశారు.

తాజా వీడియోలు

Back to Top