సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేద్దాం

ఒంగోలు :

కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా చేస్తున్న రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో జరగనున్న సమైక్య శంఖారావం సభను ప్రజలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌లు పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పార్టీకి చెందిన దర్శి నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నడాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, అద్దంకి నియోజకవర్గం సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సమైక్యవాణిని గట్టిగా వినిపించాలని వారు కోరారు. కార్యకర్తలు ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని వారు చెప్పారు. శ్రీ జగన్ సార‌థ్యంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశాలున్నాయని బూచేపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామం నుంచి సమైక్యవాదులు హైదరాబాద్ తరలి రావాల‌ని గొట్టిపాటి అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top