శ్రీకాకుళంః వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాల్ పార్టీలోకి చేరారు. వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి నరేష్‌కుమార్‌తో పాటు మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ స్వర్ణమణి, దేవేంద్ర, ఈశ్వర్‌రెడ్డి, పలువురు మాజీ సర్పంచ్‌లు,ఎంపీటీసీలు పార్టీలోకి చేరారు.వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.వైయస్ జగన్‌పై నమ్మకంతోనే వైయస్‌ఆర్‌సీపీలోకి చేరినట్లు తెలిపారు.వైయస్‌ఆర్ పాలన ఒక స్వర్ణయుగం అని, ప్రస్తుత టీడీపీ పాలన అంతా అస్తవస్త్యంగా ఉందన్నారు.వైయస్ జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ వైయస్‌ఆర్ పాలన వస్తుందన్నారు. తిత్లీ తుపాను పరిహారంలో భారీస్థాయిలో అవినీతి చోటు చేసుకుందన్నారు.బాధితులు కష్టాలు పడుతున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలో అందరికి న్యాయం జరుగుతుందన్నారు.