కడప జిల్లా రుణం తీర్చుకుంటా

* మూడు సంవత్సరాల్లో స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టితీరుతా
* అమృతానగర్‌లో వైయస్‌ జగన్‌
* లంచాలిచ్చే వారికే భూములు ఇచ్చేలా చంద్రబాబు పాలన
* 45 సంవత్సరాలకే పెన్షన్‌.. అది రూ. 2 వేలు ఇస్తాం
*అధికారంలోకి రాగానే అమ్మఒడి పథకం 
* ఇద్దరు పిల్లలను బడికి పంపిస్తే ఆ కుటుంబానికి ఏటా రూ.15 వేలు
* పిల్లల ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా మేమే భరిస్తాం
* పేదవాడి మొహంలో సంతోషంగా చూడాలనే తాపత్రయం
* వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రొద్దుటూరు: ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా.. మూడు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ కంప్లీట్‌ చేస్తా.. ఫ్యాక్టరీ కట్టి తీరుతా.. కడప రుణం తీర్చుకుంటా’నని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆరో రోజు ప్రొద్దుటూరు అమృతానగర్‌లో వైయస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..

– అమృతానగర్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న గారి (దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి) హయాంలో కట్టిన ఇళ్లు, స్థలాలు, వాటి వల్ల ఆయన మన మధ్య లేకపోయినా మేమంతా నీకు తోడుగా ఉన్నామని మీరు చూపే అభిమానం నా ఆనందానికి కారణం.
– నాన్నగారు ఇంకొన్నాళ్లు బతికేఉంటే పెండింగ్‌లో ఉన్న రోడ్లు, మంచినీటి సమస్య అన్నీ పూర్తయ్యేవి. మనం అధికారంలోకి రాగానే ప్రజల ప్రభుత్వంగా రాగానే అమృతానగర్‌లో సమస్యలు లేకుండా చేస్తా. 
– అమృతానగర్‌ వచ్చినప్పుడు పెన్షన్‌ రావడం లేదని చాలా మంది వృద్ధులు నా దగ్గరకు వచ్చి వారి గోడు చెప్పుకున్నారు. చంద్రబాబు తన పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడంటే అవ్వాతాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఆలోచనలు లేదు. చంద్రబాబుకు లంచాలిచ్చే వారికి భూములు ఇచ్చేలా పాలన జరుగుతుంది. 
– ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలని తాపత్రయపడే వారిల్లో మొదటి వాడిని నేను. ఒక్క సంవత్సరం ఆగితే వచ్చేది మన పరిపాలన. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం. ఆ పెన్షన్లు రూ. 2 వేలు చేస్తా.. అంతేకాకుండా 45 సంవత్సరాలకే పెన్షన్‌ ఇస్తా. 
– అధికారంలోకి రాగానే అమ్మఒడి అని గొప్ప కార్యక్రమాన్ని చేపడుతాం. ఇద్దరు పిల్లలను బడిలోకి పంపించినందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 15 వేలు వచ్చేలా చేస్తా.. అలా చేస్తే ఆ పిల్లలు గొప్పగా చదువుకుంటారనే ఆశ. చంద్రబాబు పాలనలో ఆ పరిస్థితులు లేవు. పిల్లలను పనులకు పంపుతున్న దుస్థితి. పిల్లల భవిష్యత్తు మార్చేందుకే అమ్మ ఒడి కార్యక్రమం. 
– ఇంజినీరింగ్‌ చదవాలంటే లక్ష రూపాయలు దాటుతుంది. ప్రభుత్వం ఫీజురియంబర్స్‌మెంట్‌ ద్వారా ఇచ్చేది రూ. 30 వేలు. అది కూడా ఇస్తుందో.. ఇవ్వదో తెలియదు. మిగిలిన డబ్బులు పేదవారు ఎక్కడ నుంచి తేవాలని అడిగితే ఇళ్లు అమ్ముకుంటాడని చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ మన పరిపాలనలో అలా ఉండదు. ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే కడుతుంది. ఫీజులు కట్టడంతో పాటు ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులకు ఖర్చులకు మరో రూ. 20 వేలు ఇస్తాం  
– 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తా.. అందరి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాం. 
– అమృతానగర్‌కు వచ్చాక ఆటోడ్రైవర్‌లు నన్ను కలిశారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా.. ప్రతి ఆటోలో నాన్న ఫోటో, నా ఫోటో పెట్టుకునేలా పరిపాలన చేస్తా.. 
– రాష్ట్రంలో నిరుద్యోగం పోవాలంటే ప్రత్యేకహోదా రావాలి. హోదా వస్తేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. 
–కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కడితే ప్రత్యక్షంగా 10 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 15 వేల ఉద్యోగాలు, మొత్తం 25 వేల ఉద్యోగాలు ఇస్తాయి. 
– పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటా.. ప్రజా సమస్యలతో ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టో తయారు చేస్తాం. చంద్రబాబు మాదిరిగా పేజీలు పేజీల అబద్ధాల మ్యానిఫెస్టో పెట్టం. రెండు లేదా మూడు పేజీల్లో మ్యానిఫెస్టో ఉంటుంది. ఆ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా పెట్టనివి కూడా చేస్తాం.. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టో చూపించి అన్నీ చేశాం అని గర్వంగా చెప్పుకుంటాం. 
Back to Top