చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ర‌క్ష‌ణ ఏది..!


గుంటూరు) రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య తో కూడా ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వ‌లేదు. ఆ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులు ఎవ‌ర‌నేది స్ప‌ష్టంగా తెలిసినా చర్య‌లు తీసుకోవ‌టం లేదు. ఫ‌లితంగా అదే నాగార్జున యూనివ‌ర్శిటీలో ఈవ్ టీజింగ్ ఘ‌ట‌న‌లు ప‌దే ప‌దే పున‌రావృతం అవుతున్నాయి.
తాజాగా ఎమ్ ఎస్ సీ చ‌దువుతున్న ర‌త్న మంజూరి ని ప్రేమిస్తున్నానంటూ ఒక విద్యార్థి వెంట ప‌డుతున్నాడు . ఆక్వా క‌ల్చ‌ర్ చ‌దువుతున్న బాల‌య్య అనే యువ‌కుడు ఈవ్ టీజింగ్ కు పాల్ప‌డుతున్నాడు. జోలికి రావ‌ద్ద‌ని ఆ అమ్మాయి ఎంత చెబుతున్నా ప‌ట్టించుకోక పోవ‌టంతో ఆ విద్యార్థిని స్థానిక పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈవ్ టీజింగ్ కు పాల్ప‌డుతున్న బాల‌య్య మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. 
రిషితే్శ్వ‌రి ఆత్మ‌హ‌త్య జ‌రిగిన వెంట‌నే ఈవ్ టీజింగ్ అరిక‌ట్టేందుకు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకొని ఉంటే ఇటువంటి చ‌ర్య‌లు పున‌రావృతం అయ్యేవి కావ‌ని స్థానికులు అంటున్నారు. నిందితుల‌కు అండ‌గా నిలిచి, రిషితేశ్వ‌రి ఫిర్యాదుల్ని పెడ చెవిని పెట్టిన ప్రిన్సిపాల్ బాబురావు మీద ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. క‌నీసం అరెస్టు కూడా చేయ‌లేదు. దీంతో అదే త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. 
Back to Top